
టాలీవుడ్‌లో ఒకప్పటి హీరోయిన్లు వరుసగా రీఎంట్రీ ఇస్తున్న తరుణంలో, ఇప్పుడు ఆనందం మూవీ హీరోయిన్ రేఖ మళ్లీ సినిమాల్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే లయ, జెనీలియా, అన్షు లాంటి నాయికలు రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను పలకరించారు. అదే బాటలో రేఖ కూడా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది.
2001లో విడుదలైన శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆనందం సినిమాలో ఆకాష్ సరసన రేఖ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తర్వాత పెద్దగా అవకాశాలు రాక కొంతకాలానికే ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు మాత్రం కొత్త ఉత్సాహంతో మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టాలని చూస్తోంది.
ఇటీవల ఆమె ఒక యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొని తన ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలు పంచుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తన లుక్స్, యాక్టింగ్‌లో ఏమాత్రం మార్పుల్లేవని నిరూపిస్తోంది.
రేఖ తనకు తగ్గ పాత్రలు వస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. రొమాంటిక్ రోల్స్ కాకపోయినా, తన వయసుకు తగ్గ భావోద్వేగ ప్రధానమైన పాత్రలు చేయాలనే ఆసక్తి చూపిస్తోంది.