Saturday, June 27, 2026
HomeMovie News'అఖండ 2' వాయిదా.. ధురంధర్‌కు కలిసి వచ్చిన తెలుగు మార్కెట్!

‘అఖండ 2’ వాయిదా.. ధురంధర్‌కు కలిసి వచ్చిన తెలుగు మార్కెట్!

ranveer-singh-dhurandhar-box-office-akhanda-2-postponement-advantage

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ మూవీ డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. 17 ఏళ్ల తర్వాత హిందీ చిత్రసీమ నుంచి వస్తున్న భారీ నిడివి ఉన్న సినిమా ఇది.

సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా, వసూళ్లు మాత్రం దూసుకెళ్తున్నాయి. ఫస్ట్ డే ఓపెనింగ్స్ రూ. 27 కోట్లుగా నమోదయ్యాయి. రెండో రోజు తొలి రోజు కన్నా ఎక్కువ వసూళ్లు (రూ. 31 కోట్లు) సాధించడం విశేషం.

నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 వాయిదా పడటం ధురంధర్ కు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఈ వారం ఒక్క కొత్త తెలుగు సినిమా కూడా రిలీజ్ అవ్వకపోవడం కూడా దీనికి కారణం.

హైదరాబాద్ విజయవాడ వంటి తెలుగు నగరాల్లో ధురంధర్ కు మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. దీంతో వసూళ్లు కూడా సాలిడ్‌గా వస్తున్నాయి.

ఓవరాల్ ఫస్ట్ వీకెండ్ కల్లా ధురంధర్ మూవీ రూ. 90 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా. విడుదలైన నాలుగు రోజులకే రూ. 100 కోట్ల క్లబ్ లో సినిమా ఎంట్రీ ఇవ్వనుందని స్పష్టమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular