
పుష్ప 1, 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్, మూడో భాగం గురించి మళ్లీ క్లారిటీ ఇచ్చాడు. సైమా 2025 వేడుకల్లో పుష్ప 3 తప్పకుండా చేస్తాను అని స్పష్టంచేశారు. అయితే టైమ్ లైన్ మాత్రం ఖరారు చేయలేదు.
అయితే రైటర్స్ టీమ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌ని 2030 ప్రాంతంలోనే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడని చెబుతున్నారు. అప్పటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అదే సమయంలో పాన్-వరల్డ్ లెవెల్ కంటెంట్‌తో సినిమాను తీసే ప్లాన్ ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే పుష్ప 2 టీజర్, క్లైమాక్స్‌లో ఇచ్చిన హింట్స్‌ని మూడో భాగానికి లింక్ చేయాలని రైటర్స్ టీమ్ పని చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కనెక్ట్ అయ్యే కథ రాయడం కోసం కనీసం రెండేళ్లకు పైగా సమయం పడుతుందని టాక్.
ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్‌తో RC17 ప్రాజెక్ట్ చేస్తున్నారు. అది పూర్తి అయిన తర్వాతే పుష్ప 3పై ఫోకస్ పెంచుతారని తెలుస్తోంది. మధ్యలో మరో చిన్న ప్రాజెక్ట్ చేసే అవకాశమున్నా, మూడో భాగం బన్నీ కెరీర్‌లోనే అతిపెద్ద పాన్-వరల్డ్ సినిమా అవుతుందని అంచనాలు ఉన్నాయి.