పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్ సెట్స్ పై చివరి దశలో ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
టీజర్ ద్వారా ప్రభాస్ లుక్స్, యాక్షన్ సీన్స్, కామెడీ హైలైట్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తుండగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
ప్రస్తుతం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఈ సాంగ్స్ కోసం మారుతి అండ్ టీమ్ ఇప్పటికే గ్రీస్ చేరుకొని లొకేషన్లను ఫైనల్ చేస్తున్నారు. వచ్చే నెలలో ప్రభాస్ కూడా గ్రీస్ వెళ్లి షూట్‌లో పాల్గొననున్నారు.
సినిమాలోని ఈ రెండు పాటలు గ్రాండ్‌గా చిత్రీకరించబడి, స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని సినీ వర్గాల టాక్. యూరప్ అందమైన లొకేషన్లలో విజువల్స్‌తో పాటు స్టైలిష్ ప్రెజెంటేషన్ ఉంటుందని చెబుతున్నారు.
డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని ముందుగా చెప్పినప్పటికీ, తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ సంక్రాంతి బరిలో జనవరి 9వ తేదీని లాక్ చేశారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.