Saturday, June 13, 2026
HomeTelanganaకవిత - షర్మిల: సేమ్ టు సేమ్.. కానీ..

కవిత – షర్మిల: సేమ్ టు సేమ్.. కానీ..

kavitha-sharmila-political-comparison

న్యూస్ డెస్క్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకే సమయంలో రెండు కీలక మహిళా నాయకురాళ్లు హాట్ టాపిక్‌గా మారారు. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, ఏపీలో షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎదగడం ఇప్పుడు చర్చనీయాంశం. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలే కావడంతో పోలికలు గీస్తున్నారు.

షర్మిల విషయానికి వస్తే, ఆమె జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి వైసీపీని నిలబెట్టారు. కానీ పార్టీ నుంచి గుర్తింపు రాకపోవడంతో తెలంగాణకు వెళ్లి కొత్త పార్టీ పెట్టారు. చివరికి దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. అంటే పని చేసినా, పదవి మాత్రం ఆలస్యంగా లభించింది.

మరోవైపు, కవిత తెలంగాణ ఉద్యమంలో జాగృతి పేరుతో కీలక పాత్ర పోషించారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించారు. కానీ అంతర్గత విభేదాలు, అవినీతి ఆరోపణలతో బీఆర్ఎస్ నుంచి దూరమయ్యారు. సొంత పార్టీలోనే ఎదిగినా, చివరికి బయటకు రావాల్సి వచ్చింది.

ఇద్దరికీ పోలికలున్నాయా అంటే పూర్తిగా లేవు. ఎందుకంటే షర్మిల పదవులు లేకుండా పార్టీ కోసం శ్రమించారు. కానీ కవిత పదవులు అనుభవించారు. అయినప్పటికీ రాజకీయంగా ఇద్దరూ బాధితులుగానే నిలిచారు.

ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జాతీయ స్థాయిలో అవకాశాలు పొందుతున్నారు. కానీ కవిత భవిష్యత్ దిశ ఏదో అనేది ఇంకా అనిశ్చితిగానే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular