Saturday, September 5, 2026
HomeSportsకోహ్లీకి లండన్‌లో ఫిట్‌నెస్ టెస్ట్.. బీసీసీఐ నిర్ణయంపై కొత్త వాదన

కోహ్లీకి లండన్‌లో ఫిట్‌నెస్ టెస్ట్.. బీసీసీఐ నిర్ణయంపై కొత్త వాదన

virat-kohli-fitness-test-london-special-treatment

న్యూస్ డెస్క్: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి బీసీసీఐ ఇచ్చిన ప్రత్యేక అనుమతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మిగతా ఆటగాళ్లందరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేస్తే, కోహ్లీ మాత్రం లండన్‌లోనే తన టెస్ట్‌ను ముగించాడు. ఈ సడలింపు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

ప్రస్తుతం కుటుంబంతో లండన్‌లో ఉన్న కోహ్లీ, ముందస్తు అనుమతి తీసుకుని అక్కడే పరీక్ష రాసినట్లు సమాచారం. యో-యో టెస్ట్, స్ట్రెంత్ టెస్ట్‌లను విజయవంతంగా పూర్తి చేశారని ఒక జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు, రోహిత్ శర్మ, గిల్, సిరాజ్ వంటి ఆటగాళ్లు ఎన్‌సీఏలోనే హాజరయ్యారు.

ఒక బీసీసీఐ అధికారి, “కోహ్లీ ముందే అనుమతి తీసుకున్నాడు. అందుకే లండన్‌లో టెస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చాం” అని చెప్పినట్లు తెలిసింది. అయితే, భవిష్యత్తులో ఇతర ఆటగాళ్లకు కూడా ఇలాంటి అవకాశం కల్పిస్తారా అన్న ప్రశ్న ఇంకా సమాధానం రాలేదు.

ఇటీవల గాయాల సమస్యలు ఎక్కువ కావడంతో బోర్డు ఫిట్‌నెస్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది. ఏ సిరీస్‌కు ఎంపిక కావాలన్నా ఫిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరి అని నిబంధన అమలులో ఉంది. అయితే, ఒక స్టార్ ఆటగాడికి ప్రత్యేక వెసులుబాటు ఇవ్వడం న్యాయమా కాదా అనే చర్చ మొదలైంది.

ఇక రిషభ్ పంత్, జడేజా, రాహుల్ వంటి ఆటగాళ్లకు రెండో దశలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీకి ఇచ్చిన మినహాయింపు వివాదాస్పదంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 17307663086a9bf779619f3