Monday, February 9, 2026
HomeMovie Newsపెద్ది రిలీజ్ డేట్‌.. సెకండ్ హాఫ్‌కి మారే ఛాన్స్?

పెద్ది రిలీజ్ డేట్‌.. సెకండ్ హాఫ్‌కి మారే ఛాన్స్?

peddi-release-shifted-to-second-half-rumors

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది గ్లింప్స్‌తోనే భారీ హైప్ తెచ్చుకుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మొదట 2026 మార్చి 28న రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం సమ్మర్‌లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదల కావడంతో క్లాష్ అవ్వకుండా ఉండేందుకు పెద్దిని సెకండ్ హాఫ్‌కి మార్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని అంటున్నారు.

సినిమా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అవుట్‌పుట్ బాగా రావడం కోసం టీమ్ ఎక్కువ టైమ్ తీసుకుంటోందని సమాచారం. అందుకే రిలీజ్ డేట్‌ని మరికొంత వెనక్కి జరపొచ్చని భావిస్తున్నారు.

చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటం మరో స్పెషల్ ఆకర్షణ.

అలాగే కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన రోల్ ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ అవుతుందని టాక్.

ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి ఫ్లాప్‌ల తర్వాత పెద్దితో మాస్ బ్లాక్‌బస్టర్ కొట్టాలని రామ్ చరణ్ చూస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అయితే బుచ్చిబాబు కూడా నెక్ట్స్ లెవెల్ డైరెక్టర్స్ జాబితాలో చేరడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular