Wednesday, September 2, 2026
HomeMovie Newsపవన్ అభిమానుల కోసం రెడీ అవుతున్న డబుల్ ట్రీట్

పవన్ అభిమానుల కోసం రెడీ అవుతున్న డబుల్ ట్రీట్

pawan-birthday-double-blast

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ ప్రత్యేకంగా ఎదురుచూస్తారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఓజి సినిమా చుట్టూ భారీ హైప్ నడుస్తోంది. యూఎస్ మార్కెట్‌లో ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ అద్భుతంగా ప్రారంభమవ్వడంతో పవన్ క్రేజ్ మరోసారి రుజువైంది.

అదే సమయంలో పవన్ మరో మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలకీ సంబంధించి అభిమానులకు ఒకేసారి ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా ఓజి నుంచి పవర్ ఫుల్ యాక్షన్ టీజర్ విడుదల చేసే ప్లాన్ ఉందని టాక్. అదే రోజు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఒక ప్రత్యేక వీడియోను మేకర్స్ సిద్ధం చేస్తున్నారని వినిపిస్తోంది. రెండు ట్రీట్స్ ఒకేసారి రావడంతో ఫ్యాన్స్ డబుల్ హ్యాపీ అవ్వడం ఖాయం.

ఓజి సినిమాను పవన్ ఫ్యాన్ బాయ్ సుజీత్ తెరకెక్కిస్తుండగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ను హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇద్దరు దర్శకులూ పవన్ ఫ్యాన్స్ కావడం ప్రత్యేక ఆకర్షణ.

మొత్తానికి ఈ బర్త్ డే ఫ్యాన్స్ కోసం మామూలు పండగ కాదు. డబుల్ బ్లాస్ట్‌తో పవన్ క్రేజ్ సోషల్ మీడియాలో మరింత పెరిగి, ఈ రెండు సినిమాల హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్తుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular