Monday, January 19, 2026
HomeSportsసూర్య కుమార్ పై పాక్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

సూర్య కుమార్ పై పాక్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

న్యూస్ డెస్క్: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత జట్టు వైఖరిపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓటమి కన్నా, టీమిండియా ప్రవర్తన తానెక్కువగా బాధపెట్టిందని అన్నాడు.

ఫైనల్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “ఇది క్రికెట్‌ను అవమానించడమే. మా జట్టుతో కరచాలనం చేయకపోవడం గౌరవాన్ని తగ్గించడం కాదు, ఆటను అవమానించడం” అని వ్యాఖ్యానించాడు.

ట్రోఫీని పాక్ మంత్రి నఖ్వీ చేతుల మీదుగా స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించిందని గుర్తుచేశాడు. అలాంటి పని ఎలాంటి ప్రొఫెషనల్ జట్టు చేయదని అన్నారు.

భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రవర్తనపై కూడా సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. “ప్రైవేట్‌గా షేక్ హ్యాండ్ ఇస్తాడు, కానీ కెమెరాల ముందుకు వచ్చాక మాత్రం దూరంగా ఉంటాడు. ఇది పైనుంచి వచ్చిన ఆదేశాలే కావచ్చు” అని అన్నాడు.

సెప్టెంబర్ 14 మ్యాచ్‌లో మొదలైన హ్యాండ్‌షేక్ వివాదం ఇప్పుడు మరింత పెరిగింది. ఫైనల్ తరువాత ట్రోఫీని తిరస్కరించినా, భారత ఆటగాళ్లు సంబరాలు కొనసాగించడం పాక్ జట్టుకు బాధ కలిగించిందని తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular