Monday, May 18, 2026
HomeMovie Newsఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో స్టార్ గెస్ట్ రోల్ ?

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో స్టార్ గెస్ట్ రోల్ ?

ntr-prashanth-neel-movie-rishab-shetty-role

ఆర్ఆర్ఆర్ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ భారీ అంచనాలు సృష్టిస్తున్నాయి. దేవర 1 తర్వాత ఆయన చేస్తున్న చిత్రం “డ్రాగన్”. ఈ సినిమాను కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ ఎక్కువగా కర్ణాటకలోనే జరుగుతుండటంతో అక్కడి అభిమానుల్లోనూ బజ్ పెరిగింది.

తాజాగా ఈ సినిమాలో ఒక స్టార్ సర్ప్రైజ్ ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి “డ్రాగన్”లో ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన పాత్ర ప్రత్యేక హైలైట్ అవుతుందని అంటున్నారు.

ఎన్టీఆర్, రిషబ్ శెట్టిల మధ్య మంచి స్నేహం ఉండటంతో ఆయన ఈ గెస్ట్ రోల్‌కి అంగీకరించినట్లు చెప్పుకుంటున్నారు. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. కానీ ఈ లీక్ టాక్‌తోనే కర్ణాటక ఆడియన్స్ లో క్రేజ్ పెరుగుతోంది.

ఇప్పటికే డ్రాగన్ మూవీలో అనిల్ కపూర్, టొవినో థామస్ లాంటి నటులు భాగమవుతున్నారు. ఇప్పుడు రిషబ్ శెట్టి జోడిస్తే ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్‌లో మరింత హైప్ తెచ్చుకుంటుందని విశ్లేషకుల అభిప్రాయం.

ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం స్పెషల్‌గా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశారట. చాలా స్లిమ్‌గా మారి కొత్త లుక్‌లో కనిపించబోతున్నారని చెబుతున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular