
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) చిత్రంపై ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను ఒకే భాగంగా కాకుండా, రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ‘KGF’, ‘సలార్’ తరహాలోనే ఈ కథకు కూడా రెండు భాగాలు అవసరమని నీల్ భావిస్తున్నారట.
ప్రశాంత్ నీల్ గతంలో ‘సలార్ పార్ట్ 2’ను ప్రకటించినా, అది ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. కానీ ‘డ్రాగన్’ విషయంలో అలా కాకుండా, రెండు భాగాల షూటింగ్‌ను ఏకకాలంలో పూర్తి చేసేలా పక్కా ప్లాన్‌తో ఉన్నారట.
ఇప్పటికే సినిమాకు సంబంధించి రెండు భారీ షెడ్యూళ్లు పూర్తయ్యాయి. వస్తున్న అవుట్‌పుట్ అద్భుతంగా ఉందని, ఇది ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్రబృందం ధీమాగా ఉంది.
రెండు భాగాలను ఒకేసారి షూట్ చేయడం వల్ల, విడుదల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండదని తెలుస్తోంది. ‘KGF’లా ఏళ్ల తరబడి కాకుండా, తక్కువ విరామంలోనే రెండో భాగాన్ని కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ‘KGF’తో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన నీల్, తారక్‌తో ఊర మాస్ సినిమా తీసి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
