Saturday, June 13, 2026
HomeMovie Newsనితిన్ నెక్స్ట్ మువీ ఎప్పుడు మరి?

నితిన్ నెక్స్ట్ మువీ ఎప్పుడు మరి?

nithiin-next-movie-updates-and-delays

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్ మరోసారి స్లో అయ్యింది. తమ్ముడు సినిమా ఫ్లాప్ తర్వాత ఆయన నుంచి కొత్త ప్రాజెక్ట్ ప్రకటన రావడం లేదు. వరుసగా చెక్, రంగ్‌దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవడంతో నిర్మాతలు కూడా వెనకడుగు వేస్తున్నారట.

మొదట దిల్ రాజు నిర్మించాల్సిన ఎల్లమ్మ ప్రాజెక్ట్ నితిన్‌తో ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత అదే ప్రాజెక్ట్‌ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి మార్చినట్లు సమాచారం.

అలాగే ఇష్క్ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో స్వారీ సినిమా చేయాలని చర్చలు జరిగినా, యూవీ క్రియేషన్స్ బ్యాక్‌స్టెప్ వేసిందని టాక్. దీంతో ఆ సినిమా కూడా నిలిచిపోయింది.

ఇక 90స్ బయోపిక్ డైరెక్టర్ ఆదిత్య హాసన్‌తో చేయాల్సిన సినిమా కూడా వేరే హీరో చేతుల్లోకి వెళ్లింది. తాజాగా లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్‌తో నితిన్ ఓ కొత్త సినిమా చేయనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో “ఏం చేస్తున్నావ్ నితిన్?” అంటూ ప్రశ్నిస్తున్నారు. నితిన్ తిరిగి హిట్ ట్రాక్‌లోకి రావాలంటే, ఇష్క్, అ ఆ తరహా కంటెంట్‌తో రాక తప్పదని సినీ వర్గాల అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular