
నాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా, టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్ తర్వాత మేకర్స్ పెద్ద సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేశారు, నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఈవెంట్లో నాని మాట్లాడుతూ, ఖచ్చితంగా శైలేష్ తో మరో సినిమా చేయబోతున్నానని ప్రామిస్ చేశాడు. అయితే ఈసారి అది హిట్ సిరీస్‌లోని తదుపరి భాగం కాదని, పూర్తిగా ఫన్, కామెడీతో కూడిన ఎంటర్టైనర్ అని ఆయన వెల్లడించాడు.
శైలేష్ చెప్పిన లైన్ తనకు బాగా నచ్చిందని, ఎప్పుడు మొదలవుతుందో ఇంకా చెప్పలేనప్పటికీ, అది హిలేరియస్ గా ఉండబోతోందని నాని చెప్పాడు.
హిట్ 3 కాంబినేషన్ నుంచి ఈసారి నాన్-వైలెన్స్ కామెడీ సినిమా రావడం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. నాని ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు.
nani, hit3, shailesh-kolanu, comedy-movie, tollywood,