
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కెరీర్ లో 100వ సినిమా కోసం చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ‘కుబేర’, ‘కూలీ’ సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ లో కనిపించిన నాగ్, తన సోలో మైల్ స్టోన్ మూవీని మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉండేలా చూసుకుంటున్నారు.
100వ సినిమా విషయంలో ఫ్యాన్స్ ని ఎక్కువ కాలం వెయిట్ చేయించడం ఇష్టం లేని నాగార్జున, త్వరలోనే సినిమా అనౌన్స్ మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పక్కాగా ఉన్నాకే ప్రకటిద్దామనే ఆలోచనలో ఉన్నారట. తమిళ దర్శకుడు కార్తీక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తోంది.
ఈ సినిమాపై మొదటి నుంచే హై బజ్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనౌన్స్ మెంట్ తోనే ఒక గ్లింప్స్ విడుదల చేసి అంచనాలు పెంచాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, రొమాన్స్, కామెడీ అన్నీ ఉండేలా చూసుకుంటున్నారు.
నాగ్ 100వ సినిమా పాన్ ఇండియా అటెంప్ట్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ తో పాటు నేషనల్ లెవెల్ ఆడియన్స్ ను మెప్పించే కథ, కథనాలను ఎంచుకున్నారట. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కూడా భారీగా ఉండబోతుందని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా ముహూర్తం వచ్చే సంక్రాంతికి (2026) ఉంటుందని, సరిగ్గా ఏడాది తర్వాత అంటే 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో నాగార్జున అండ్ టీం ఉన్నట్లు సమాచారం. సరైన టైం చూసి ఈ మెగా ప్రాజెక్ట్ ప్రకటన రానుంది.
