
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల స్పీడ్ తగ్గించడం లేదు. ఇప్పటికే అనిల్ రావిపూడి ‘మన శంకర్ వరప్రసాద్’, ‘విశ్వంభర’ సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఈ రెండు పూర్తయిన వెంటనే బాబీ డైరెక్షన్ లో మరో మెగా మాస్ ఎంటర్టైనర్ ఉంటుంది. ఆ తర్వాతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఆయన డిసైడ్ చేయబోతున్నారు.
ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘రాజా సాబ్’ తీస్తున్న మారుతి, మెగాస్టార్ ను డైరెక్ట్ చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన మారుతికి మంచి కథ ఉంటే చేద్దామని చిరంజీవి కూడా గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మారుతి ఇప్పటికే చిరంజీవి కోసం ఒక క్రేజీ స్టోరీ లైన్ ను రెడీ చేసుకున్నారట. మెగాస్టార్ ఆమోదం కోసం ఆ స్టోరీతో వెయిట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి మారుతి ఫోకస్ అంతా ప్రభాస్ సినిమా ‘రాజా సాబ్’ పైనే ఉంది.
మారుతి మార్క్ కామెడీ టైమింగ్ చిరంజీవిలో పర్ఫెక్ట్ గా సూటవుతుంది. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే చిరంజీవి కామెడీని మారుతి వేరే లెవల్ లో వాడుకునే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ అభిమానులు కూడా ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు.
‘రాజా సాబ్’ రిజల్ట్ ని బట్టే మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి కూడా పాన్ ఇండియా ఇంపాక్ట్ ఉండే సినిమానే చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మెగా కాంబినేషన్ ఎప్పుడు కుదురుతుందో చూడాలి.
