కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి భారీ విజయం సాధించిన చిత్రాలతో పేరు తెచ్చుకున్న హొంబాలే ఫిలింస్ తాజాగా మరో సంచలనాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమాటిక్ యూనివర్స్‌ను రూపొందించనున్నట్లు తెలిపింది.
‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ పేరుతో ఏకంగా 7 చిత్రాలను తీసుకురావాలని హొంబాలే డిసైడ్ అయ్యింది. దీనిలో భాగంగా మొదటి చిత్రం ‘మహావతార్ నరసింహా’ను 2025 జూలై 25న విడుదల చేయబోతోంది.
ఈ యూనివర్స్‌లో విష్ణు అవతారాలు ఆధారంగా ప్రతి సినిమాను రూపొందించబోతున్నారు. ప్రతి అవతారం కథతో మైథలాజికల్ అద్భుత ప్రయాణం చూపించనున్నారు.
2027లో మహావతార్ పరశురామ్, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాదీశ్, 2033లో గోకులనందన విడుదల కానున్నాయి. 2035, 2037లో కల్కి పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ చేయనున్నారు.
ఇంత భారీ స్థాయిలో మైథలాజికల్ సినిమాలు రావడం అంటే ఆడియన్స్‌కి నూతన అనుభూతి ఇచ్చే అవకాశం. హొంబాలే ప్రొడక్షన్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ కలిసి ఈ సిరీస్‌ను నిర్మించబోతున్నారు.
ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకొని రూపొందే ఈ సిరీస్ భారత సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.
mahavatar cinematic universe, hombale productions update, narasimha mythological film, vishnu avatars movies, epic indian film series,