Friday, December 12, 2025
HomeMovie News5 గంటల నిడివి చిత్రాలు.. విజయం సాధించిన సినిమాలు ఇవే!

5 గంటల నిడివి చిత్రాలు.. విజయం సాధించిన సినిమాలు ఇవే!

longest-running-indian-movies-mahatma-lagaan-gangs-of-wasseypur

సాధారణంగా 2 నుంచి 2.5 గంటల నిడివి ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్‌లో కూర్చుంటాడా అనే అనుమానం ఉంటుంది. కానీ భారతీయ సినీ చరిత్రలో 5 గంటలకు పైగా నిడివితో వచ్చి ప్రేక్షకులను మెప్పించి, విజయం సాధించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి.

మహాత్మా (గాంధీ జీవిత చరిత్ర): ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఏకంగా 330 నిమిషాలు (5 గంటల 30 నిమిషాలు) నిడివితో వచ్చింది. విఠల్ భాయ్ ఝవేరి దర్శకత్వం వహించిన ఈ సినిమా గాంధీ గురించి తెలియని ఎన్నో విషయాలను తెలియజేసి, మంచి విజయాన్ని అందుకుంది.

గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్: నేరం హింస కాన్సెప్ట్‌తో ధన్బాద్ బొగ్గు మాఫియాపై తెరకెక్కిన ఈ చిత్రం మొత్తం 319 నిమిషాల నిడివితో రూపొందించారు. అనురాగ్ కశ్యప్ దీన్ని రెండు వేరువేరు భాగాలుగా విభజించి రెండు నెలల వ్యవధిలో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.

లగాన్: అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ఈ చిత్రం నిడివి 233 నిమిషాలు. బ్రిటిష్ పాలనపై కరువుతో బాధపడుతున్న రైతులు పన్నుల నుంచి ఉపశమనం కోసం క్రికెట్ మ్యాచ్ సవాల్ స్వీకరించడం అనే అద్భుతమైన కథాంశం ప్రేక్షకులను మెప్పించింది.

ఇతర లాంగ్ రన్ సినిమాలు

  • తమస్ (298 నిమిషాలు)
  • ఎల్‌ఓసీ: కార్గిల్ (255 నిమిషాలు)
  • బాహుబలి ది ఎపిక్ (225 నిమిషాలు)
  • యానిమల్ (201 నిమిషాలు)

మంచి స్క్రీన్ ప్లే, సంగీతం, రియల్ కంటెంట్ ఉంటే సినిమా నిడివి ఎక్కువైనా ప్రేక్షకుడు తప్పకుండా ఎంజాయ్ చేస్తాడని ఈ చిత్రాలు నిరూపించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular