సౌత్ సినిమా పరిశ్రమలో KVN ప్రొడక్షన్స్ పేరు ఇప్పుడు పెద్దగా వినిపిస్తోంది. మొదట కన్నడ సినిమాలతో ప్రారంభమైన ఈ బ్యానర్, ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ దాకా దూసుకెళ్తోంది.
ప్రస్తుతం కేవీఎన్ సంస్థ యష్ హీరోగా తెరకెక్కుతోన్న టాక్సిక్ సినిమాతో పాటు, తమిళంలో విజయ్ హీరోగా జన నాయగన్, మలయాళంలో మరో సినిమా నిర్మిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేపట్టనుంది. ఇక చందూ మొండేటి వంటి డైరెక్టర్లకు కూడా ఈ బ్యానర్ అడ్వాన్స్ ఇచ్చిందని టాక్.
KVN ప్రొడక్షన్స్ ఇప్పుడు టాప్ డైరెక్టర్లను ముందుగానే రిజర్వ్ చేసుకోవడమే కాకుండా, మైత్రీ మూవీ మేకర్స్ ఫాలో చేసిన స్ట్రాటజీని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం నిర్మాణ రంగంలో కొత్త దిశగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ కాంపెనీ పాన్ ఇండియా స్థాయిలో బడా ప్రొడక్షన్ హౌస్‌గా ఎదగాలని చూస్తోంది. టాప్ డైరెక్టర్లు, స్టార్ హీరోలతో పెద్ద సినిమాలను ప్లాన్ చేస్తోంది.
ఇంతలా ఆక్టివ్‌గా వ్యవహరిస్తున్న KVN ప్రొడక్షన్స్ ముందస్తు అడ్వాన్సులతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది.