Sunday, January 18, 2026
HomeSportsభార‌త్‌ - పాక్ సెమీస్: ట్విస్ట్ ఇచ్చిన స్పాన్సర్స్

భార‌త్‌ – పాక్ సెమీస్: ట్విస్ట్ ఇచ్చిన స్పాన్సర్స్

india-pakistan-clash-controversy-wcl-sponsor-withdraws

స్పోర్ట్స్ డెస్క్: వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో భారత్ – పాకిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్ చుట్టూ ఇప్పుడు గందరగోళ వాతావరణం నెలకొంది. తాజాగా ఈ మ్యాచ్ స్పాన్సర్‌గా ఉన్న ఈజ్‌మైట్రిప్ సంస్థ అధికారికంగా తమ సహ యజమాని నిశాంత్ పిట్టి ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేశారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో సంబంధాలు పెట్టుకోలేమని, దేశం ముందు వ్యాపారం కాదు అని ఆయన చెప్పారు. గురువారం జరగాల్సిన ఈ సెమీ ఫైనల్‌పై ఇప్పటికే ఆందోళనలు ఉన్న పరిస్థితుల్లో, టాప్ స్పాన్సర్ తప్పుకోవడంతో మ్యాచ్ జరగడంపై ఇంకా అనుమానాలు పెరిగాయి.

గతంలో లీగ్ దశలో పాకిస్థాన్‌తో ఆడకూడదని ఇండియా ఛాంపియన్స్ నిరాకరించి, నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇప్పుడు అదే సమస్య సెమీస్‌కు వచ్చి చేరింది.

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనలు నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య మళ్లీ పోరు జరగడం పై విస్తృత చర్చ జరుగుతోంది. మ్యాచ్‌కు స్పాన్సర్ లేకపోవడంతో నిర్వాహకులు కొత్త నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు.

ఇప్పుడు ఈ సెమీ ఫైనల్ వాయిదా వేస్తారా? లేక పాకిస్థాన్‌ను నేరుగా ఫైనల్‌కు పంపిస్తారా? అనే అనుమానాలు స్పోర్ట్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular