
ఈ ఏడాది బాలీవుడ్‌లోనే అత్యంత భారీగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వార్ 2 ఇప్పుడు అభిమానులలో భారీ అంచనాలు రేపుతోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ స్క్రీన్‌పై కనిపించబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు రెస్పాన్స్ కూడా అద్భుతంగా వచ్చింది.
వార్ 2ని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా, యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఇది మూడో భాగంగా వస్తోంది. ఈ చిత్రంలో కథ, యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు గతంలో వచ్చిన పఠాన్, టైగర్ లాంటి సినిమాలకు లింక్ ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రెడిట్ సీన్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
పఠాన్, టైగర్ 3 సినిమాల్లో లాగానే వార్ 2లో కూడా రెండు క్రెడిట్ సీన్స్ ఉంటాయని టాక్. ఇవి కూడా స్పై యూనివర్స్‌లో రాబోతున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన హింట్‌గా ఉండొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా పఠాన్ పార్ట్ 2తో పాటు, ఆల్ఫా అనే ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ స్పై యాక్షన్ చిత్రం సూచనలుగా ఈ సీన్స్ ఉంటాయన్న ప్రచారం ఊపందుకుంది.
ఇలాంటి కొత్త మార్పులతో బాలీవుడ్ స్పై యూనివర్స్ మరింత విస్తరిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో సినిమా విడుదలయ్యాకే స్పష్టత వస్తుంది.
