Sunday, August 16, 2026
HomeAndhra Pradeshస‌రస్వ‌తి షేర్ల బ‌దిలీ: జ‌గ‌న్‌కు ఊర‌ట, షర్మిల‌కు నిరాశ

స‌రస్వ‌తి షేర్ల బ‌దిలీ: జ‌గ‌న్‌కు ఊర‌ట, షర్మిల‌కు నిరాశ

saraswati-shares-transfer-stopped-jagan-relief-sharmila-shock

న్యూస్ డెస్క్: హైదరాబాద్ కంపెనీ లా ట్రైబ్యునల్ స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ అండ్ ఇండ‌స్ట్రీస్ షేర్ల బదిలీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ షేర్లను ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీనితో వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్‌కు ఊరట లభించగా, షర్మిల, విజయమ్మకు నిరాశ తప్పలేదు.

ఈ వివాదానికి కారణం షేర్ల బదిలీ విషయంలోనే. మొదట జ‌గన్ తన వాటా విజయమ్మకు బదలాయించగా, తర్వాత ఆమె గిఫ్ట్‌గా షర్మిలకు ఇచ్చారు. కానీ అక్రమ ఆస్తుల కేసులో ఈ కంపెనీపై ఈడీ సీజ్ విధించింది. దీనివల్ల షేర్లను విక్రయించడానికో, ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికో వీలు లేదు.

అయితే, ఎన్నికల ముందు విజయమ్మ షేర్లను షర్మిలకు బదలాయించారు. దీనిపై జ‌గన్ అభ్యంతరం తెలిపారు. దీంతో ట్రైబ్యునల్‌లో కేసు దాఖలైంది.

ఈ వ్యవహారం కుటుంబ రాజకీయాలకు మించి వివాదంగా మారింది. బోర్డు నుంచి కూడా జ‌గన్ వైదొలిగినట్లు ప్రకటించింది. మంగళవారం ట్రైబ్యునల్ ఈ షేర్ల బదిలీని నిలిపివేస్తూ తుది తీర్పు ఇచ్చింది.

ఇప్పుడు కేసు పరిణామాలపై మరిన్ని చర్చలు జరుగుతాయని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular