Friday, August 29, 2025
HomeMovie Newsవంద కోట్లు దాటిన ‘కుబేర’.. ఫుల్ రన్‌లో సెన్సేషన్

వంద కోట్లు దాటిన ‘కుబేర’.. ఫుల్ రన్‌లో సెన్సేషన్

kubera-movie-crosses-100cr-mark

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సినిమా ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎమోషన్‌తో అద్భుతంగా కనెక్ట్ చేసింది.

నాగార్జున, ధనుష్, రష్మిక లాంటి స్టార్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కథ, కథనాల్లో శేఖర్ కమ్ముల టచ్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేక్షకులు సినిమా చూసి మంచి స్పందన ఇస్తున్నారు.

విడుదలైన తొలిరోజు నుంచే ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

తాజాగా ‘కుబేర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్‌ను దాటి పెద్ద సెన్సేషన్ సృష్టించింది. మేకర్స్ అధికారికంగా ఈ అప్డేట్‌ను వెల్లడించారు.

వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమా.. ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇది శేఖర్ కమ్ముల కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలవనుంది.

ఇంకా టోటల్ రన్‌లో ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కీలకంగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular