
న్యూస్ డెస్క్: తెలుగు సినిమాల్లో ముద్దు సీన్స్ విషయంలో ఉన్న హద్దులను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దాటబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన తాజా చిత్రం ‘కె ర్యాంప్’ లో హీరోయిన్ యుక్తి తరేజాతో ఏకంగా 16 సార్లు లిప్‌లాక్ చేశాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది.
ఈ రొమాంటిక్ సీన్స్ కారణంగా అప్పట్లో వివాదం రేపిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా రికార్డును కిరణ్ బ్రేక్ చేస్తాడా అనే చర్చ మొదలైంది.
ఈ సినిమా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా విడుదల సమయానికి సెన్సార్ బోర్డ్ నుంచి కత్తెరింపులు తప్పకపోవచ్చని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
ఎ సర్టిఫికెట్ ఇచ్చినా, ఒకటి రెండు ముద్దు సీన్స్‌ను తగ్గించడం లేదా వాటి నిడివి కుదించడం వంటివి జరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయితే, యూనిట్ సభ్యులు మాత్రం సాధ్యమైనన్ని ఎక్కువ ముద్దు సీన్స్‌ను ఉంచాలని ప్రయత్నిస్తున్నారు.
కె ర్యాంప్ సినిమా అనగానే, సింపుల్, మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలు చేసే కిరణ్ అబ్బవరం, ఈసారి దానికి భిన్నంగా కనిపించబోతున్నాడు. ప్రమోషనల్ స్టఫ్‌ను చూస్తుంటే, ఆయన పాత్ర బోల్డ్‌గా, విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. కె సినిమా హిట్టయిన సెంటిమెంట్‌ను వర్కౌట్ చేయడానికి కె ర్యాంప్ టైటిల్‌తో సినిమాను తెస్తున్నారు.
చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ, సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలు చాలా విభిన్నంగా, బోల్డ్‌గా ఉంటాయన్నారు. అందుకే అన్ని ముద్దు సీన్స్‌కు స్కోప్ ఉంటుందని చెప్పారు. ఈ లిప్‌లాక్ సీన్స్ కావాలని పెట్టినట్లు కాకుండా, సందర్భానుసారంగానే ఉంటాయని వారు చెబుతున్నారు.
