
విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో ముఖ్యమైన సినిమా “కింగ్డమ్”పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి విజయ్ పూర్తిగా వేరే షేడ్స్‌తో కనిపించబోతున్నాడన్న టాక్ ట్రెండ్‌లో ఉంది.
ఇదిలా ఉంటే, కింగ్డమ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే విశేషంగా జరిగింది. వరల్డ్ వైడ్‌గా సుమారు 50 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అంటే, సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 100 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో విజయ్ సినిమా ది ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, కింగ్డమ్ మీద మాత్రం ట్రేడ్‌లో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి.
ఈసారి ప్రేక్షకుల్లోనూ, బయ్యర్లలోనూ బలమైన నమ్మకం ఉంది. ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విజయ్ స్టైల్, గౌతమ్ టేకింగ్‌పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
ఓపెనింగ్స్ పరంగా కూడా సినిమాకు మంచి నంబర్స్ వస్తాయని భావిస్తున్నారు. విజయ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకుంటాడా అనేది థియేటర్ల వద్ద తేలనుంది.