Friday, January 16, 2026
HomeMovie Newsకీర్తికి స‌క్సెస్ ద‌క్కేదెప్పుడు? వరుస ఫ్లాపులతో నిరాశ!

కీర్తికి స‌క్సెస్ ద‌క్కేదెప్పుడు? వరుస ఫ్లాపులతో నిరాశ!

keerthy-suresh-continuous-flops-revolver-reeta-box-office-result

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మధ్య వరుస ఫ్లాపులను ఎదుర్కొంటోంది. తెలుగులో ఆమె నుంచి వచ్చిన ఏ సినిమాలూ పెద్దగా ఆడటం లేదు.

రీసెంట్‌గా కీర్తి నటించిన రివాల్వర్ రీటా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

స్వయంగా కీర్తి సురేష్ ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొనినా, సినిమా కంటెంట్ క్లిక్ అవ్వకపోవడంతో మొదటి రోజే డిజాస్టర్‌గా నిలిచింది. చాలా మందికి అసలు ఆ సినిమా రిలీజైందన్న విషయం కూడా తెలియలేదు.

దీంతో కీర్తి ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. మొన్నామధ్య కీర్తి తెలుగులో చేసిన ఉప్పు కప్పురంబురఘుతాత మూవీలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి.

పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కీర్తి.. ఆ లోటు పూరించాలని వరుస సినిమాలను రిలీజ్ చేసినా ఫలితం దక్కడం లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన దిల్‌ రాజు బ్యానర్‌లో ఆమె సినిమా చేస్తోంది. మరి ఈ సినిమా అయినా కీర్తికి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular