
బాలకృష్ణ మోహన్ బాబు వంటి తెలుగు స్టార్స్ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ఘనంగా జరుపుకున్నారు. కానీ కోట్లాది మంది అభిమానులున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగస్టులో 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నా, తమిళ సినీ పరిశ్రమ మాత్రం ఎలాంటి వేడుకలు నిర్వహించలేదు.
తమిళ పరిశ్రమ మౌనం వహించినా, ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ చేయని పని చేసింది. పత్రిక ఫ్రంట్ పేజీలో రజనీకాంత్ ఫోటోను ముద్రించి ఆయన స్టామినాకు అరుదైన గౌరవాన్ని అందించింది.
రజనీకాంత్ కేవలం నటుడిగానే కాక, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాంటి నటుడి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ ఎలాంటి వేడుక నిర్వహించకపోవడం శోచనీయం. అందుకు కారణం ఏమిటనే చర్చ నడుస్తోంది.
రజనీకాంత్ స్వస్థలం కర్ణాటక కావడమే దీనికి కారణమా అనే అనుమానం కొంతమందికి ఉంది. సొంత నటులకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇతరులకు ఇవ్వరనే భాషాభేదం కోలీవుడ్‌లో ఉందనే వాదన ఉంది.
అయితే, తమిళ పరిశ్రమలోనే కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న స్టార్ కాబట్టి భాషాభేదం ఉండదనే వాదన ఉంది. కోలీవుడ్ మౌనం వెనుక అసలు వాస్తవాలు ఏంటి అన్నది మాత్రం తేలాలి.
