
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు ఆయనను గురువారం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరనిచేశారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న వైద్య బృందం ప్రస్తుతం అవసరమైన మెడికల్ టెస్టులు నిర్వహిస్తోంది. ఆయనకు సంబంధించిన తాజా హెల్త్ రిపోర్టుల కోసం పరీక్షలు జరుగుతున్నాయి.
ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్, జూలై 5న డిశ్చార్జ్ అయ్యారు. రక్తంలో షుగర్, సోడియం స్థాయుల బాగా తగ్గిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఆ సమయంలో వారంరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అలాగే తర్వాత రీచెకప్‌కు రావాలని చెప్పారు.
వైద్యుల సూచన మేరకు ఈ రోజు మళ్లీ కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం స్టెబుల్‌గా ఉన్నట్లు సమాచారం.
ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అధికారిక సమాచారం ఇంకా విడుదల కాలేదు. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.