న్యూస్ డెస్క్: చిన్నారులపై లైంగిక దాడులు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సహించదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన “లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత” సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం, బాధితులకు సహాయంగా భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
“భద్రత, సహాయం కోసం వచ్చిన చిన్నారులకు మానసిక, వైద్య సహాయం వెంటనే అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని ఆయన తెలిపారు. భరోసా కేంద్రాల పరిధిని మరింత విస్తరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
చిన్నారులపై హింసను సమాజం గట్టిగా నిరసించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు బాధితుల పక్షాన నిలవాలన్నారు.
ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డిజిటల్ యుగంలో యువత, ప్రజలు సోషల్ మీడియా వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
