
సినిమా ఇండస్ట్రీ అన్నాక రూమర్స్ కామన్. కానీ కొన్ని వార్తలు సెలబ్రిటీల మనసుని గట్టిగా తాకుతాయి, వారిని మానసికంగా కృంగదీస్తాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కాయదు లోహర్ విషయంలో అదే జరిగింది. తనపై వచ్చిన ఒక అసభ్యకరమైన రూమర్ గురించి మాట్లాడుతూ ఆమె లైవ్ ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
‘అల్లూరి’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన కాయదు, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, ఆమె సినిమాల కంటే ప్రైవేట్ పార్టీల ద్వారానే ఎక్కువ వెనకేసుకుంటున్నారని, ఒక్కో పార్టీకి హాజరవ్వడానికి ఏకంగా రూ. 35 లక్షలు వసూలు చేస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది ఆమె ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసింది.
దీనిపై తాజాగా స్పందించిన కాయదు, ఆ రూమర్ గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. యాంకర్ ఆ ప్రశ్న అడగ్గానే.. మాట రాక కన్నీళ్లు పెట్టుకున్నారు. తన క్యారెక్టర్‌ని కించపరిచేలా ఇలాంటి వార్తలు రావడం తనను ఎంతగానో బాధించిందని, ఇలాంటి సిచువేషన్‌ను ఎలా ఫేస్ చేయాలో తనకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
“నాకు ఎలాంటి గాడ్ ఫాదర్ లేరు. నా కష్టంతో నేను పైకి వస్తున్నాను. కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల నాకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. రాసేవాళ్లకు అది ఒక వార్త కావచ్చు, కానీ అది నా లైఫ్‌ని ఎంత డిస్టర్బ్ చేస్తోందో వాళ్లకు అర్థం కాదు” అంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
అందరితో స్నేహంగా ఉండే తనపై ఎందుకు ఇంత విషం చిమ్ముతున్నారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె ‘ఫంకీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న టైమ్‌లో ఇలాంటి పర్సనల్ అటాక్స్ రావడం దురదృష్టకరం. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
