
ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్)’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అవతార్ ఫ్రాంచైజీకి వచ్చిన భారీ విజయం వెనుక ప్రధాన కారణం, ఈ సినిమా పాత్రల రూపమేనని విశ్లేషకులు చెబుతారు. కామెరూన్ లార్డ్ శ్రీరాముడి నిలువెత్తు రూపాన్ని, ఆంజనేయుడి తోకను మెర్జ్ చేసి సరికొత్త ప్రాణి అవతార్‌ను సృష్టించారు.
అవతార్ ఫ్రాంచైజీకి ఈ స్థాయి విజయాన్ని (5 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు) ఇచ్చింది లార్డ్ శ్రీరాముడిపై కామెరూన్ నమ్మకమే అని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు లార్డ్ రాముడి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని కామెరూన్ భావిస్తున్నారట. ఇప్పుడు భారతదేశంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ టీజర్ ని ‘అవతార్ 3’తో పాటు థియేటర్లకు అనుసంధానిస్తున్నారు.
నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ చిత్రాన్ని పాన్ వరల్డ్ మార్కెట్లలో రిలీజ్ చేయడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమా టీజర్, ‘అవతార్ 3’ ఆడుతున్న ప్రపంచవ్యాప్త థియేటర్లలో అటాచ్ చేస్తారు. రామాయణం చిత్రానికి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న DNEG విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తోంది.
అయితే, జేమ్స్ కామెరూన్ అభిమాని అయిన ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమా ‘వారణాసి’ టీజర్ ని ‘అవతార్ 3’ థియేటర్లకు జత చేస్తారని భావించినా, అది జరగడం లేదు. గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా రాజమౌళి ‘వారణాసి’ చిత్రాన్ని అత్యంత భారీగా రూపొందిస్తున్నప్పటికీ, ఈ అవకాశం నితీష్ తివారీ ‘రామాయణం’కి దక్కింది. నితీష్ తివారీ దర్శకత్వంలో దాదాపు 4,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణం’, రెండు భాగాలుగా 2026 2027 దీపావళికి విడుదల కానుంది.
