
న్యూస్ డెస్క్: ఆసియా కప్ 2025లో భారత్ పాక్‌ను చిత్తు చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో ఫలితానికంటే, ఆటగాళ్ల కౌంటర్ పెద్ద చర్చగా మారింది. విజయం అనంతరం టీమిండియా ఆటగాళ్లు పాక్ క్రికెటర్లతో కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న క్లారిటీని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వివరించారు.
మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య మాట్లాడుతూ.. “మేమిక్కడికి కేవలం క్రికెట్ ఆడేందుకే వచ్చాం. పాక్‌కి సరైన సమాధానం గెలుపుతోనే ఇచ్చాం. కొన్ని సందర్భాల్లో క్రీడాస్ఫూర్తి కంటే ముందున్న విషయాలు ఉంటాయి. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు మా విజయం అంకితం. అలాగే ఆపరేషన్ సిందూర్‌లో మన సైన్యం చేసిన ధైర్యసాహసాలకు గౌరవం” అన్నారు.
మ్యాచ్ ముగిసిన వెంటనే పాక్ ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ కోసం ఎదురుచూశారు. కానీ సూర్యకుమార్ బౌండరీ కొట్టి నేరుగా పెవిలియన్‌లోకి వెళ్లిపోగా, మిగతా ఆటగాళ్లు కూడా వెంటనే డోర్స్ మూసుకున్నారు. అభిమానులు దీన్ని పాక్‌కు టీమిండియా ఇచ్చిన క్లియర్ మెసేజ్‌గా భావిస్తున్నారు.
ఈ నిర్ణయానికి గౌతమ్ గంభీర్ కూడా మద్దతు ఇచ్చారు. “జట్టుగా మేమంతా పహల్గాం బాధితులకు సంఘీభావం తెలపాలని అనుకున్నాం. సైన్యం ధైర్యానికి ధన్యవాదాలు” అని చెప్పారు. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో అభిమానులు టీమిండియా వైఖరిని ప్రశంసిస్తున్నారు. ఉగ్రదాడుల మధ్య స్నేహపూర్వకత ప్రదర్శన అవసరం లేదని, గెలుపు రూపంలోనే బదులిచ్చారని కామెంట్లు చేస్తున్నారు. పాక్‌తో హ్యాండ్‌షేక్ మానేయడం వారికి బాగా నచ్చింది.