
న్యూస్ డెస్క్: దేశ వ్యాప్తంగా కొత్త జీఎస్టీ 2.0 శ్లాబులు అమలులోకి వచ్చాయి. ఆదివారం అర్థరాత్రి నుంచి ఈ సంస్కరణలు అమలులోకి రావడంతో ధరలు తగ్గుతాయని కేంద్రం చెబుతున్నా, కొన్నింటి ధరలు మాత్రం రెట్టింపు కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని “దేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగ్గ ఘట్టం”గా అభివర్ణించారు.
ఇప్పటి వరకు ఉన్న 5, 14, 18, 24 శాతం శ్లాబుల్లో మార్పులు చేశారు. 14 శాతం రేటును రద్దు చేసి, ఇప్పుడు కేవలం 5% మరియు 18% శ్లాబులు కొనసాగుతాయి. దీనివల్ల రోజువారీ వాడక వస్తువుల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.
అయితే, పెద్దగా ప్రచారం కాని మరో మార్పు కలవరపెడుతోంది. కొత్తగా 40% శ్లాబు తీసుకొచ్చారు. దీనిలో సుగంధ ద్రవ్యాలు దాల్చిన చెక్క, మిరియాలు, యాలుకలు, జీలకర్ర, లవంగాలు, ఇంగువ లాంటి వంటింటి అవసరాలు చేర్చబడ్డాయి.
ఇక సిగరెట్లు, చుట్టలు, మద్యం, గుట్కా వంటి పదార్థాలు కూడా ఈ శ్లాబులోకి వచ్చాయి. ఇవి సాధారణ వినియోగదారులకు పెను భారంగా మారే అవకాశం ఉంది.
అలాగే మహిళల బ్యూటీ ఉత్పత్తులు, సెంట్లు, అత్తర్లు కూడా 40% పన్ను కిందకి వచ్చాయి. ఈ విభాగం ధరలు గణనీయంగా పెరగనున్నాయి.
మొత్తానికి జీఎస్టీ 2.0లో కొన్ని వస్తువుల ధరలు తగ్గినా, వంటింటి నుంచి లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల వరకు ఎన్నో వస్తువులు వాచిపోనున్నాయి. ప్రజలకు ఊరటనిచ్చే రీఫార్మ్‌తో పాటు కొత్త భారాలు కూడా జోడైనట్టే.