Monday, October 5, 2026
HomeAndhra Pradeshజగన్ మళ్లీ యలహంకలోనే? రాజకీయాల్లో కొత్త చర్చ

జగన్ మళ్లీ యలహంకలోనే? రాజకీయాల్లో కొత్త చర్చ

jagan-yelahanka-trips-become-political-debate

న్యూస్ డెస్క్: 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ తరచూ బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది. శుక్రవారం కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఆయన మళ్లీ బెంగళూరు వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.

అసెంబ్లీలో విపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో జగన్ సభకు రాకుండా ఉంటున్నారు. కానీ అదే సమయంలో మండలిలో వైసీపీ సభ్యులు పాల్గొంటున్నారు. వారికి మార్గనిర్దేశం చేయాల్సిన జగన్ మాత్రం రాష్ట్రం విడిచి వెళ్లడం పై విమర్శలు పెరుగుతున్నాయి.

జగన్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, అందుకే మీడియా ద్వారా ప్రజా సమస్యలను చెప్పుతానని ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ సమావేశాల సమయంలో ఆయన గైర్హాజరు అవ్వడం రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధం అయింది.

టీడీపీ వర్గాలు జగన్ ఈ ఏడాది మాత్రమే 51 సార్లు బెంగళూరు వెళ్లారని లెక్కలు చెబుతున్నాయి. ఈ ట్రిప్పులపై వారే ప్రత్యేకంగా కౌంటర్లు వేస్తున్నారు.

జగన్ బెంగళూరులో ఎక్కువ సమయం గడుపుతున్నారనే ఆరోపణ కొత్తది కాదు. గతంలో వైసీపీ స్థాపించే ముందు కూడా ఆయన ఎక్కువగా అక్కడే ఉండేవారు. ఇప్పుడు ఓటమి తర్వాత తిరిగి యలహంకనే ఆయనకు ప్రధాన స్థావరంగా మారిందని చెబుతున్నారు.

మొత్తం మీద, జగన్ అసెంబ్లీని బహిష్కరించడం, తరచూ బెంగళూరు వెళ్లడం.. ఇది కేవలం వ్యక్తిగత ఎంపికనా? లేక వ్యూహాత్మక నిర్ణయమా అన్నదానిపై రాజకీయ చర్చ ముమ్మరమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular