Monday, January 19, 2026
HomeBusinessఐఫోన్ 17 సేల్స్ స్టార్ట్.. ఇండియాలో క్యూలే క్యూలు!

ఐఫోన్ 17 సేల్స్ స్టార్ట్.. ఇండియాలో క్యూలే క్యూలు!

న్యూస్ డెస్క్: టెక్ ప్రపంచం అంతా ఐఫోన్ 17 క్రేజ్ లో ఉంది. యాపిల్ సరికొత్త ఐఫోన్ 17 సిరీస్ ను సెప్టెంబర్ 19న గ్లోబల్ గా రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పుడు ఇండియాలో కూడా సేల్స్ మొదలవడంతో యాపిల్ స్టోర్ల ముందు విపరీతమైన క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.

ఈసారి యాపిల్ ఐఫోన్ ఎయిర్ మోడల్ ను కేవలం 5.6 మిల్లీమీటర్ల మందంతో విడుదల చేసింది. ఇది ఇప్పటివరకు వచ్చిన అత్యంత సన్నని ఫోన్ గా నిలిచింది. ఇందులో ఇకపై ఈ-సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలాగే 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను పూర్తిగా తొలగించారు.

బేస్ మోడల్ ధర కూడా గత ఐఫోన్ 16 తో పోలిస్తే పెరిగింది. ప్రస్తుతం భారత్ లో 89,900 రూపాయల నుండి ఈ మోడల్స్ ప్రారంభమవుతున్నాయి. 256 జీబీ, 512 జీబీ వేరియంట్స్ మార్కెట్లో లభిస్తున్నాయి.

ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే లోని యాపిల్ స్టోర్ల వద్ద ఐఫోన్ ప్రేమికులు రాత్రి నుంచే క్యూలో నిలబడ్డారు. ముఖ్యంగా ముంబై బికేసి స్టోర్ ముందు భారీ క్యూ ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టెక్నికల్ ఫీచర్ల పరంగా కూడా ఈసారి యాపిల్ మరింత సెక్యూరిటీ, ఫాస్ట్ ప్రాసెసింగ్ ను అందించింది. డిజైన్ పరంగా కూడా ఐఫోన్ 17 సిరీస్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది.

మొత్తం మీద ఐఫోన్ 17 సిరీస్ ఇండియాలో మొదటి రోజే బంపర్ రెస్పాన్స్ పొందింది. ధరలు ఎంత ఉన్నా, ఐఫోన్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు అనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular