
మూవీడెస్క్: దుల్కర్ – శివ కార్తికేయన్ మళ్లీ బాక్సాఫీస్ పోరు! సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద పోరుకు రానున్నారు.
గత సంవత్సరం దీపావళి సందర్భంగా వచ్చిన లక్కీ భాస్కర్ మరియు అమరన్ సినిమాలు ఒకే రోజు విడుదలై మంచి హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.
ఈసారి కూడా సెప్టెంబర్ 5న వీరిద్దరి సినిమాలు థియేటర్లలోకి వస్తుండటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
దుల్కర్ నటిస్తున్న కాంత సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పీరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కాంతపై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
ఇక శివ కార్తికేయన్ నటిస్తున్న మదరాసి చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. ఆయనతో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మేకర్స్ ఇప్పటికే సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
అదే రోజు తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా కూడా విడుదల కానుంది. ఈ మూడు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
మరి దుల్కర్ – శివ కార్తికేయన్ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.