
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కి ముందు నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. పాటలు, స్పెషల్ వీడియోలతో ఫ్యాన్స్ ఉత్సాహం పెంచిన టీమ్, ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ అందించింది.
చెన్నైలో జరిగిన ‘కూలీ’ ఆడియో లాంచ్ వేడుకను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చింది. సన్ నెక్స్ట్ వేదికగా ఈ ఈవెంట్ ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉంది. థియేటర్ రిలీజ్‌కి ముందు ఇలాంటి అవకాశం రావడంతో రజనీ అభిమానులు ముచ్చటపడుతున్నారు.
‘Coolie Unleashed’ పేరుతో అందుబాటులో ఉన్న ఈ స్పెషల్ వీడియోలో రజనీకాంత్ ఫన్నీ స్పీచ్, ఇతర నటీనటుల ఆసక్తికర వ్యాఖ్యలు, అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ లైవ్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ కంటెంట్ ఓటీటీలో అందుబాటులో ఉండటం ఫ్యాన్స్‌కు మరింత ఎంజాయ్ చేసే ఛాన్స్ ఇచ్చింది.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజనీకాంత్ కొత్త స్టైల్లో కనిపించబోతున్నారు. ట్రైలర్, పోస్టర్లలోనే ఆయన ఎనర్జీ చూసి ఫ్యాన్స్ థియేటర్స్‌లో భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంత బలమైన కాస్ట్‌తో ‘కూలీ’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
రిలీజ్‌కు ముందు ఓటీటీలో ఆడియో లాంచ్‌ను స్ట్రీమ్ చేయడం, ప్రమోషన్స్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసినట్లే అని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు థియేటర్స్‌లో ఈ సినిమాను చూడటానికి కౌంట్‌డౌన్ మొదలైంది.