
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో బద్రీ సినిమాతో లాంచ్ అయిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్‌లోనే స్థిరపడింది. హిందీలో స్టార్ లీగ్‌లో చేరకపోయినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవల అమీషా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయంలో షాకింగ్ రివిలేషన్లు చేసింది. “చాలా మంది ప్రపోజ్ చేశారు. కానీ వారిలో చాలామంది పెళ్లి తర్వాత సినిమాలు వదిలేయాలి అనే షరతు పెట్టారు. నాకు ఆ కండీషన్ నచ్చలేదు. అందుకే ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాను” అని చెప్పింది.
సినిమాల్లోకి రాకముందే ఒక రిలేషన్‌లో ఉన్నానని కూడా అమీషా వెల్లడించింది. కానీ చివర్లో అదే కారణంగా ఆ రిలేషన్‌ను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని, కానీ తన వృత్తిని అర్థం చేసుకునే వ్యక్తి దొరకాలి అని క్లారిటీ ఇచ్చింది.
ఇప్పటికీ ప్రపోజల్స్ వస్తూనే ఉన్నాయని అమీషా చెబుతోంది. “వయసు పెద్ద విషయం కాదు. మనసులో పరిపక్వత ఉండాలి. చిన్నవాడు అయినా నన్ను అర్థం చేసుకుంటే నేను ఓకే” అని స్పష్టంగా చెప్పింది.
గతేడాది గదర్ 2తో భారీ విజయం సాధించిన అమీషా, మళ్లీ వరుస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం మూడు సినిమాలకు సైన్ చేసింది. అందులో రెండు షూటింగ్‌కు రెడీ అవుతున్నాయి.
మొత్తానికి, 50 ఏళ్ల వయసులోనూ అమీషా పటేల్‌కు లవ్ ప్రపోజల్స్ వరుసగా రావడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.