యంగ్ హీరో అఖిల్ అక్కినేని కొత్త సినిమా లెనిన్‌కి సంబంధించి తాజా అప్డేట్ హాట్ టాపిక్‌గా మారింది. ఏజెంట్ ఫలితంతో ఎదురవుదెబ్బల తర్వాత అఖిల్ పూర్తి మారిపోయి మాస్ లుక్‌లో వస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుండగా, కథలో మైథాలజీ మిక్స్ చేసిన రూరల్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉండబోతుందని టాక్ బలంగా వినిపిస్తోంది.
ఈ పాటకు ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ గాత్రం అందించిందని సమాచారం. పాట చిత్రీకరణ కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే టాలీవుడ్లో అనన్య రెండో అడుగు పెట్టినట్టే.
ఇక అఖిల్ ఇటీవల వివాహ బిజీలో ఉండటంతో షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈ గ్యాప్‌ను వినియోగించుకునే ప్రయత్నంలో మేకర్స్ స్పెషల్ ఐటెం సాంగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఈ పాటను భారీ సెటప్‌లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల సినిమాకు మరింత హైప్ చేకూరనుంది. ఈ వార్తలపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.