Tuesday, February 10, 2026
HomeMovie Newsమహేష్ టీ-షర్ట్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే

మహేష్ టీ-షర్ట్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికీ యంగ్ అండ్ స్టైలిష్ హీరోగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల యంగ్ హీరో అఖిల్, జైనబ్ రవ్జీ రిసెప్షన్‌కు ఫ్యామిలీతో హాజరైన మహేష్ బాబు లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

సతీమణి నమ్రత, కుమార్తె సితారతో కలిసి వేడుకకు హాజరైన మహేష్ సింపుల్ టీ-షర్ట్ ధరించి స్టైలిష్‌గా దర్శనమిచ్చారు. ఫోటోలు చూసినవారంతా ఆయన స్టైల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఆ టీ-షర్ట్ ధర అక్షరాలా రూ.1,50,000 అని బయటపడడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హెర్మ్స్ కంపెనీకి చెందిన ఈ లగ్జరీ టీ-షర్ట్‌ ధర సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సింపుల్‌గా కనిపించినా మహేష్ రేంజ్ అదీ అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు “ఇదీ మహేష్ స్టైల్‌” అంటూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆయన లుక్, డ్రెస్సింగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB 29 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ అడ్వెంచర్ జానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular