
వలసపాలన వదిలిన తరువాత పేదరికాన్ని తుంచేయడంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, భారత్ అభివృద్ధి మార్గంలో వేగంగా పయనిస్తుంటే, పాకిస్థాన్ మాత్రం పతన దిశలో కొనసాగుతోంది.
భారత్ విషయానికొస్తే, 2011-12లో 27.1%గా ఉన్న తీవ్ర పేదరిక రేటు 2022-23 నాటికి 5.3%కి తగ్గింది. ఇది అనగా 26.9 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఆర్థిక విధానాలు దీనికి కారణమయ్యాయి.
ఇదే సమయంలో, పాకిస్థాన్‌లో మాత్రం 2017-18లో 4.9%గా ఉన్న తీవ్ర పేదరిక రేటు 2020-21 నాటికి 16.5%కి పెరిగింది. IMF నుంచి ఇప్పటికే 25 బెయిలౌట్లు తీసుకున్నప్పటికీ, నిధుల దుర్వినియోగం, దుర్వ్యయంతో పాక్ పరిస్థితి విషమంగా మారింది.
ఇది రెండు దేశాల దృష్టికోణాల్లో ఎంతటి తేడా ఉందో నిరూపిస్తోంది. భారత్ ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, పాక్ దుష్ప్రధాన్యతలతో అంధకారంలో నడుస్తోంది.
ప్రపంచానికి ఇది రెండు పాఠాలు నేర్పే సందర్భం. సరైన దారిలో నడిస్తే విజయాన్ని సాధించవచ్చని భారత్ నిరూపిస్తుండగా, తప్పు దారుల్లో నడిస్తే పతనం తప్పదని పాక్ చూపిస్తోంది.
