
అడివి శేష్ తన సినిమాల విషయంలో ఎప్పుడూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘డెకాయిట్’ చిత్రాన్ని 2026, మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, అదే రోజు ‘KGF’ స్టార్ యష్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ కూడా విడుదల కానుంది.
ఈ భారీ పోటీపై అడివి శేష్ ఆసక్తికరంగా స్పందించాడు. ‘టాక్సిక్’తో పోటీకి తాము భయపడటం లేదని, రెండు సినిమాలు ఒకేసారి విడుదలై విజయం సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నాడు. ‘బాక్సాఫీస్ వార్’ అనేది కేవలం మీడియా సృష్టేనని కొట్టిపారేశాడు.
ఎంత పెద్ద సినిమా ఉన్నా, తన సినిమా కంటెంట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, సైలెంట్‌గా వచ్చి హిట్ కొడతామని శేష్ ధీమా వ్యక్తం చేశాడు.
నిజానికి ‘డెకాయిట్’ మొదట మరో హీరోయిన్‌తో ప్రారంభమైంది. కానీ, ఆమె తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు. ఉదయం ఆఫర్ చేస్తే, మధ్యాహ్నానికే మృణాల్ ఓకే చెప్పిందని శేష్ తెలిపాడు.
‘డెకాయిట్’తో పాటు, శేష్ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘గూఢచారి 2’ (G2) కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది. ఈ స్పై థ్రిల్లర్‌పై కూడా పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి.
