
‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాలతో లోకేష్ కనగరాజ్ పాన్-ఇండియా రేంజ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. కమల్ హాసన్ కెరీర్‌కే ఊపిరి పోసిన ఈ దర్శకుడితో పనిచేయాలని టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరూ క్యూ కట్టారు.
కానీ, రజినీకాంత్‌తో తీసిన ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. ఈ ఒక్క ఫ్లాప్‌తో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. కమల్-రజినీలతో ప్లాన్ చేసిన భారీ మల్టీస్టారర్ కూడా ఈ దెబ్బతో అటకెక్కింది.
‘విక్రమ్’ సమయంలో, అజిత్ ఫ్యాన్స్ తమ హీరోతో లోకేష్ ఎప్పుడు సినిమా చేస్తాడా అని వేయికళ్లతో ఎదురుచూశారు. ఈ కాంబో కోసం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్స్ కూడా నడిపించారు. అది వారి కలల ప్రాజెక్ట్.
ఇప్పుడు ఆ కల నిజమయ్యే సమయం వచ్చింది. లోకేష్ తన తదుపరి చిత్రాన్ని అజిత్‌తో చేసేందుకు సిద్ధమయ్యాడని, కథకు అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. కానీ, అభిమానులే “బాబోయ్ వద్దు” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
‘కూలీ’ ఫ్లాప్ తర్వాత లోకేష్ ఫామ్‌పై వారికి నమ్మకం పోయింది. తమ హీరోతో ప్రయోగాలు చేసి, కెరీర్‌ను దెబ్బతీస్తాడేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. అప్పుడు కావాలన్నవారే ఇప్పుడు వద్దనడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
