fbpx
Saturday, June 21, 2025
HomeMovie Newsప్రభాస్ బీట్స్ ఆఫ్ 'రాధే శ్యామ్' విడుదల

ప్రభాస్ బీట్స్ ఆఫ్ ‘రాధే శ్యామ్’ విడుదల

Prabhas BeatsOfRadheshyam TeaserReleased

టాలీవుడ్: యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘రాధే శ్యామ్’. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన మోషన్ పోస్టర్ ఒకటి ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ అనే పేరుతో ఒక టీజర్ విడుదల చేసింది సినిమా టీం. ఈ వారంలో ప్రభాస్ ‘విక్రమాదిత్య‘ లుక్ అలాగే హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే ‘ప్రేరణ‘ లుక్ ని విడుదల చేసిన మేకర్స్ ఇపుడు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసి ప్రభాస్ ఫాన్స్ ని ఖుషి చేసారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం ఈ దసరాకి విడుదల అవాలి. కానీ అనుకోని అవాంతరాల వలన విడుదల ఆలస్యం అయింది. ప్రస్తుతం ఈ సినిమా టీం యూరోప్ లో షూటింగ్ ముగించే పనిలో ఉన్నారు.

విడుదల చేసిన టీజర్ లో ఒక ట్రైన్ చూపించి అందులో రోమియో – జూలియట్, సలీం – అనార్కలి, దేవదాస్ – పార్వతి ని చూపించి తర్వాత ప్రభాస్ , పూజ హెగ్డే లని చూపించి అంత గొప్ప క్లాసిక్ ప్రేమ కథని తెరకెక్కించబోతున్నాం అని చెప్పకనే చెప్పారు. ఈ టీజర్ లో వచ్చే మ్యూజిక్ కూడా వినసొంపుగా ఉంది. ఒక వింటేజ్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం మరియు హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని 2021 వేసవి లో ఈ సినిమాని విడుదల చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

Beats Of Radhe Shyam | Prabhas | Pooja Hegde | Radha Krishna Kumar | Happy Birthday Prabhas

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular