fbpx
Thursday, June 26, 2025
HomeMovie Newsకన్నప్ప గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం.. 5400 స్క్రీన్‌లతో విశ్వరూపం!

కన్నప్ప గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం.. 5400 స్క్రీన్‌లతో విశ్వరూపం!

manchu-vishnu-kannappa-movie-worldwide-release-details

పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన “కన్నప్ప” సినిమా రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది. మంచు విష్ణు హీరోగా, ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5400కి పైగా స్క్రీన్‌లలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇందులో 4000 స్క్రీన్‌లు భారతదేశంలోనే ఉండటం విశేషం. ఇది మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యంత పెద్ద రిలీజవుతుందన్న మాట.

అయితే ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్, 4డిఎక్స్ వర్షన్‌లలోనూ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ టెక్నికల్ ఫార్మాట్లలో విడుదల కావడం వల్ల ప్రేక్షకులకు ఓ విభిన్న అనుభూతి దక్కనుంది.

కన్నప్ప చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న స్టీఫెన్ డేవెస్సీ తన గొప్ప స్కోర్‌తో సినిమాకు మరింత బలాన్ని జోడించారు. మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. జూన్ 27న ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

kannappa movie release, manchu vishnu pan india film, mukesh kumar singh direction, 5400 screens release, kannappa imax 4dx version,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular