Monday, January 19, 2026
HomeMovie News‘ఐకాన్’ సినిమా ఫిక్స్‌డ్‌.. కొత్త హీరోతో దిల్ రాజు ప్రణాళిక

‘ఐకాన్’ సినిమా ఫిక్స్‌డ్‌.. కొత్త హీరోతో దిల్ రాజు ప్రణాళిక

icon-movie-to-start-with-new-hero-soon

టాలీవుడ్ హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదల కానుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

ప్రోమోషన్స్‌లో భాగంగా దిల్ రాజు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. ప్రత్యేకించి గతంలో ప్రకటించిన ‘ఐకాన్’ సినిమా గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాలనుకున్నారు.

కానీ అప్పట్లో పుష్ప సిరీస్‌తో బన్నీ బిజీగా ఉండటంతో ఆ సినిమా మొదలవలేదు. దీంతో చాలా మంది ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అయ్యిందని భావించారు.

అయితే దిల్ రాజు మాత్రం క్లారిటీ ఇచ్చారు. ఐకాన్ సినిమా తప్పకుండా వస్తుందని, త్వరలోనే కొత్త హీరోతో సెట్స్ పైకి తీసుకెళ్తామని తెలిపారు.

ఇప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతున్నాయని సమాచారం. మరి అల్లు అర్జున్ స్థానంలో ఎవరు హీరోగా వస్తారన్నదే ఆసక్తికరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular