
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో మాస్ ఆడియెన్స్‌కి బాగా నచ్చిన సినిమాల్లో సరైనోడు టాప్‌లో ఉంటుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా బన్నీ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, మాస్ సాంగ్స్, ఫైట్లు ప్రేక్షకులను ఊరగొట్టాయి.
ఇప్పుడు అదే సరైనోడుకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో గీతా ఆర్ట్స్ ఉన్నట్లు సమాచారం. బన్నీకి సరిగ్గా సరిపోయే మాస్ రోల్‌తో సరైనోడు 2ని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం బోయపాటి శ్రీను మళ్లీ డైరెక్టర్‌గా వస్తారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు బోయపాటి కూడా అఖండ 2 పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ ఇద్దరూ తమ ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన తర్వాతే సరైనోడు 2పై క్లారిటీ వస్తుందని టాక్.
ఒకవేళ ఈ కాంబినేషన్ మళ్లీ కుదిరితే, బాక్సాఫీస్ వద్ద మాస్ ఫ్యాన్స్‌కి మళ్లీ పండగే అని చెప్పాలి. బన్నీ – బోయపాటి కాంబో నుంచి వచ్చే సినిమా ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో ఇప్పటికే అభిమానులు ఊహించేస్తున్నారు.