
టాలీవుడ్‌లో మాస్ సినిమాల మాస్టర్‌గా గుర్తింపు పొందిన దర్శకుడు వివి వినాయక్ మళ్లీ యాక్షన్‌లోకి వస్తున్నారని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది. ఆది, టాగూర్, లక్ష్మి, అదుర్స్ లాంటి బ్లాక్‌బస్టర్లతో అభిమానులను మెప్పించిన ఆయన, గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తన రీఎంట్రీ కోసం ఓ పవర్‌ఫుల్ మాస్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే వస్తున్న సమాచారం ప్రకారం, వినాయక్ కొత్త ప్రాజెక్ట్ విక్టరీ వెంకటేష్‌తోనే ఉండబోతోందట. వీరిద్దరి కలయికలో వచ్చిన లక్ష్మి అప్పట్లో పెద్ద హిట్ కావడంతో, మళ్లీ ఈ కాంబో వస్తే మాస్ ఆడియెన్స్‌లో మంచి హైప్ క్రియేట్ అవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వినాయక్ ఎప్పటిలాగే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తోనే రాబోతున్నారని తెలుస్తోంది. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బలంగా ఉండబోతున్నాయని టాక్. మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ రెండింటినీ ఆకట్టుకునేలా స్క్రిప్ట్‌ని రెడీ చేశారట.
ఇక వెంకీ మామ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత సరైన మాస్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఈ కాంబో కుదిరితే, అది ఆయన కెరీర్‌కి కూడా కొత్త ఎనర్జీ ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.