
యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యునివర్స్‌కు ‘వార్ 2’ ఇచ్చిన ఫలితం పెద్ద షాక్‌గా మారింది. మల్టీ స్టారర్‌గా, వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినా సినిమా బాక్సాఫీస్‌లో ఆశించిన స్థాయిలో నిలవలేదు. దీంతో నిర్మాత ఆదిత్య చోప్రా స్పై యునివర్స్ భవిష్యత్తు దిశగా ఆలోచనలో పడ్డారు.
ఇలాంటి సమయంలోనే డిసెంబర్ 25న విడుదల కానున్న ‘అల్ఫా’ మూవీపై దృష్టి మరింత పెరిగింది. బాబీ డియోల్ ఎండ్ క్రెడిట్స్ సీన్‌తో ఈ సినిమాకు కనెక్ట్ ఉన్నట్టు చూపించారు. శివ్ రవైల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్‌లో, శార్వరి వాఘ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
అయితే, ఇప్పటికే షూటింగ్ చేసిన కొన్ని ఎపిసోడ్స్‌ని రివ్యూ చేసిన తర్వాత స్క్రిప్ట్ రిపేర్లు ప్రారంభమయ్యాయి. అవసరమైతే రీ షూట్ కూడా చేయాలని టీమ్ భావిస్తోంది.
స్పై యునివర్స్‌ను హాలీవుడ్ అవెంజర్స్ తరహాలో తీర్చిదిద్దాలని ఆదిత్య చోప్రా కలలు కన్నా, ‘టైగర్ 3’, ‘వార్ 2’ ఇచ్చిన ఫలితాలు ఆయన ప్లాన్లను తారుమారు చేశాయి. ఇకపై అదే కథా ఫార్మాట్‌ను వాడితే ప్రేక్షకులు అంగీకరించరని భావిస్తున్నారు.
‘అల్ఫా’ ఫలితం బాగాలేకపోతే, ముందుగా అనుకున్న ‘టైగర్ వర్సెస్ పఠాన్’, ‘జవాన్ 2’ ప్రాజెక్టులు వాయిదా పడే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
