fbpx
Wednesday, June 18, 2025
HomeMovie Newsకింగ్ డమ్ రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్? అభిమానుల్లో అసహనం!

కింగ్ డమ్ రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్? అభిమానుల్లో అసహనం!

vijaydeverakonda-kingdom-release-delay-creates-confusion

విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ సినిమా విడుదల తేదీ మళ్లీ అనిశ్చితిలో పడింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో రూపొందుతోంది. షూటింగ్ పూర్తయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతుండటంతో రిలీజ్ పై స్పష్టత లేదు.

మొదట మే 30న విడుదలచేస్తామని మేకర్స్ ప్రకటించారు. అనంతరం జూలై 4కి వాయిదా వేశారు. కానీ ఆ రోజు నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ కావడంతో మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశముంది. తాజా సమాచారం ప్రకారం, జూలై 25న సినిమా విడుదల చేసే యోచనలో ఉన్నారు.

అయితే అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం రజినీకాంత్ ‘కూలీ’ చిత్రంతో బిజీగా ఉన్నందున, కింగ్ డమ్ కోసం పనిచేయడం ఆలస్యమవుతోందట. దీంతో ఆగస్టు 1న విడుదల చేసే అవకాశం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ ఆ రోజు దుల్కర్ సల్మాన్ ‘కాంత’ సినిమా రిలీజ్ కావడం, ఆ తర్వాత వార్ 2, కూలీ వంటి భారీ సినిమాలు రావడం కూడా కింగ్ డమ్ కు పోటీగా మారేలా ఉంది. దీంతో జూలైలో మిస్ అయితే సినిమా హైప్‌ తగ్గే ప్రమాదముంది.

మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి కానీ.. ప్రమోషన్స్ మాత్రం ఇప్పటినుంచే పెంచాల్సిన అవసరం ఉంది.

vijaydeverakonda, kingdommovie, gautamtinnanuri, anirudhravichander, tollywood updates,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular