
మూవీడెస్క్: టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ స్టార్ డమ్ కి బాటలు వేసిన పెళ్లి చూపులు సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
ఈ చిత్రంతో విజయ్ కెరీర్ కొత్త మలుపు తిరిగింది.
అదే విధంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కి కూడా ఈ సినిమా తొలి ప్రయత్నంలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చింది.
ఇప్పటికే అటు విజయ్ ఇటు తరుణ్ ఇండస్ట్రీలో తమదైన గుర్తింపు అందుకుని, బిజీ అవుతూ తమకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.
కానీ ఇప్పుడు “పెళ్లి చూపులు” కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవబోతుందనే వార్తలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
తరుణ్ భాస్కర్ ఓ కథను వినిపించగా, విజయ్ ఆ కథ పట్ల ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
ఇది యాక్షన్, కామెడీ జోనర్స్ లో తెరకెక్కనుందట. మూవీ భారీ బడ్జెట్ తో రాబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఎంపిక జరుగుతున్నప్పటికీ, త్వరలోనే స్టోరీ ఫైనల్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.